రైతులను రాజకీయాలకు బలిచేయొద్దు.. ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

ప్రతిపక్షం, జూలై 08: తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల మధ్య రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సాగునీటి అవసరం ఉన్నప్పటికీ గోదావరి జలాలను ఎత్తిపోసే చర్యలు చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు.

రైతులు కంటతడి పెడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నప్పటికీ కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను నడపాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని కేటీఆర్ పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాజకీయ విభేదాలు ఉంటే వాటిని రైతులపై చూపొద్దని, రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడా నీటి చుక్క లేకపోయినా సాగునీటిని అందించే సామర్థ్యం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఉందని, దానిని వినియోగించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే గోదావరి జలాలను లిఫ్ట్ చేసి సాగునీటిని అందించే చర్యలు చేపట్టాలని కేటీఆర్ తన ట్వీట్‌లో డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News