ప్రతిపక్షం, జూలై 03: తెలంగాణ రాష్ట్ర అప్పుల అంశంపై బహిరంగ చర్చకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులపై చర్చించేందుకు తాను సిద్ధమని ప్రకటించిన మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు ఇచ్చిన సవాల్ మేరకు ప్రెస్‌క్లబ్‌కు హాజరయ్యారు.
తాను వెల్లడించిన అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమని జూపల్లి మరోసారి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు చర్చకు వస్తారని ఆశిస్తూ వారి కోసం ప్రెస్‌క్లబ్‌లో వేచి చూస్తున్నారు.
రాష్ట్ర అప్పుల అంశంపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది.

















