ప్రతిపక్షం, జూన్ 29: హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడు యువతితో సన్నిహితంగా మెలిగి, ఓయో హోటళ్లలో కలుస్తూ అనంతరం కో-లివింగ్‌లో సహజీవనం చేశాడు. ఈ క్రమంలో యువతి వద్ద నుంచి రూ.4 లక్షల నగదు, ఐఫోన్ తీసుకుని పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి.
తరువాత పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా, రూ.1 కోటి ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని యువకుడు డిమాండ్ చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి తన స్వగ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

















