Trending Now

వామ్మో.. అక్రమాలు..!

ప్రైవేట్​ గృహానికి ప్రభుత్వ సొమ్ము

నేడు పోలీస్​హౌసింగ్​ కార్పొరేషన్​లో మాయాజాలం

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఏ శాఖ చూసినా.. ఏమున్నది గర్వకారణం.. అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలే అన్న చందంగా గత బీఆర్​ఎస్​ తొమ్మిదేళ్ల పాలన కొనసాగింది. గత ప్రభుత్వంలో జరిగిన ఒక్కొక్క అవినీతి, స్కాంలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఆక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది. ధరణి పేరుతో పాలకులే ప్రభుత్వ భూములను కారుచౌకగా కొట్టేసిన విషయం మరువక ముందే, గొర్రెల పంపిణీలో భారీ ఎత్తున అవినీతి జరిగిన విషయం తెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పలువురు అధికారులను అరెస్ట్​ చేసిన విషయం తెలిసిందే. మరోక విషయం ఏమిటంటే అప్పటి ప్రతిపక్ష నాయకులు ఫోన్టు ట్యాపింగ్​ చేసిన విషయం బయటపడుతుందన్న నెపంతో డీఎస్సీ ర్యాంక్​ అధికారు ఫైళ్లను, హార్డ్​ డెస్క్​లను తగుల బెట్టిన సంఘటనలో క్రమినల్​ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

తాజాగా తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌లో నిధుల దుర్వినియోగం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరమ్మతులతోపాటు సామగ్రి కొనుగోలు పేరిట సొమ్ము స్వాహా చేసినట్లు తెలుస్తోంది. రూ.50‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌_-60 లక్షల నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో (టీఎస్‌పీహెచ్‌సీఎల్‌) నిధుల దుర్వినియోగం వ్యవహారం కలకలం రేపుతోంది. సొంత ఇంటినే క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న ఓ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గృహానికి మరమ్మతుల పేరిట రూ.లక్షల్లో సొమ్ము వెచ్చించేందుకు ప్రతిపాదనలు రూపొందించడం విస్తుగొలుపుతోంది. రూ.లక్షల నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలపై అంతర్గతంగా విచారణ సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు నిర్మాణరంగంలో అపార అనుభవముంది. రాష్ట్రవ్యాప్తంగా జైళ్లు, పోలీసు, అటవీ తదితర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అనేక భవనాలను ఈ సంస్థ నిర్మించింది.

అయితే ఓ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ క్యాంపు కార్యాలయంతో పాటు ప్రధాన కార్యాలయానికి కేటాయించిన నిధుల వినియోగంలో అవకతవకలు జరిగినట్లు సమాచారం. రాష్ట్ర విభజన అనంతరం ఆ కార్పొరేషన్‌ ఛైర్మన్‌కు సంబంధించి తెలంగాణలో క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు ఇప్పటికీ అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలోనే సదరు ఛైర్మన్‌ తన ఇంటినే కార్యాలయంగా మార్చుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా దానికి మరమ్మతులతోపాటు టీవీ, ఏసీ, ఫర్నీచర్‌ పేరిట కార్పొరేషన్‌ నిధుల్ని కేటాయిస్తూ వస్తున్నారు. ఇప్పుడా విషయం కాస్తా వివాదాస్పద అంశానికి దారితీసింది.

టాయిలెట్ల మరమ్మతులకు రూ.5.50 లక్షలా..?

సదరు కార్పొరేషన్‌ ఛైర్మన్‌కు రూ.లక్ష జీతంతో పాటు ఇంటికి అద్దె కింద ప్రతి నెలా రూ.50,000లు ఇస్తున్నారు. కన్వేయన్స్‌ అలవెన్స్‌ కింద రూ.30,000లు, ఫ్యూయల్‌ ఛార్జీల కింద మరో రూ.15,000లు చెల్లిస్తున్నారు. ఆయన హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లోని సొంత అపార్ట్‌మెంట్‌లో ఉంటూ అద్దె తీసుకుంటున్నారు. ఆ ఆపార్ట్‌మెంట్‌నే క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తున్నారు. రెసిడెన్స్‌ కమ్‌ క్యాంప్‌ ఆఫీస్‌ రూఫ్‌ లీకేజీ మరమ్మతుల కోసం రూ.6.20 లక్షలు కేటాయించారు. అదే సమయంలో క్యాంప్‌ ఆఫీస్‌ మరమ్మతుల కింద మరో రూ.6.95 లక్షలను మంజూరుచేశారు.మరోసారి క్యాంపు కార్యాలయంలో వాల్‌పేపర్‌తోపాటు ఇతర సదుపాయాలకోసం రూ.10.3 లక్షలను, ఫర్నిచర్‌కోసం రూ.9.7 లక్షల్ని వెచ్చించారు. ప్రధాన కార్యాలయంలో టాయిలెట్ల మరమ్మతుల పేరిట ఏకంగా రూ.5.5లక్షలు ఖర్చు పెట్టారు. ఛైర్మన్‌ ఛాంబర్‌ మరమ్మతులకు మరో రూ.9.1 లక్షలు కేటాయించారు. వీటిల్లోనూ నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Spread the love