ప్రతిపక్షం, పెద్దపల్లి, ఏప్రిల్ 15 : పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో జెడ్పీటీసీలు, పాక్స్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) చైర్మన్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం పెద్దపల్లి నియోజక వర్గ పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం బందపల్లిలోని, స్వరూప గార్డెన్ లో నిర్వహించగా.. పెద్దపల్లి జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, జూలపల్లి జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్, పెద్దపల్లి పాక్స్ చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి, కాల్వ శ్రీరాంపూర్ పాక్స్ చైర్మన్ చదువు రామ్ చంద్రారెడ్డి తదితరులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామని జెడ్పీటీసీలు, పాక్స్ చైర్మన్లు అన్నారు.