Trending Now

ఘనంగా శ్రీరాములోరి కళ్యాణం..

ప్రతిపక్షం, ఎల్బీనగర్ ఏప్రిల్ 17: ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట్ డివిజన్ దుర్గా నగర్ కాలనీలో నెలకొని ఉన్న అతి పురాతనమైన శివాలయంలో బన్నీ బీరప్ప ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ మద్ది కరుణాకర్ రెడ్డి, తుమ్మలూరు మాజీ సర్పంచ్ మద్ది సురేఖ రెడ్డి, గోపాల్ ముదిరాజ్, ఎం ఏ భాష, భాస్కరరావు, తిరుపతయ్య గుప్త ,రాజు యాదయ్య గౌడ్, తిరుపతి రెడ్డి , ఎస్ విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ హరిహర క్షేత్రంలో..

శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో శ్రీ హరి హర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం శ్రీ సీతా రాముల కళ్యాణం మహోత్సవంలో ఆలయ చైర్మన్ దంపతులు వంగా చంద్ర రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ డైరెక్టర్లు సద్ది సందీప్ రెడ్డి, లంకల రమేష్ రెడ్డి, కొక్కొండ సూర్య ప్రకాష్ గుప్తా,సుంకరి రమేష్ గౌడ్, లింగాల దశరథ గౌడ్, మిరియాల అంజయ్య గుప్తా, నిర్మల్లేష్ గుప్తా, ముత్యాల కేశవరెడ్డి, బొడ్ల మల్లికార్జున్ గుప్తా, శివారెడ్డి, రామకృష్ణ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

సాహెబ్ నగర్ లో.. ఈ రోజు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా బిఎన్ రెడ్డి డివిజన్ మాజీ కార్పొరెటర్ శ్రీమతి ముద్దగౌని లక్ష్మిప్రసన్న, రామ్మోహన్ గౌడ్, బీఎన్ రెడ్డి డివిజన్ లోని పలు కాలనీలలో శ్రీ సీతారాముల వారి కల్యాణ మహోత్సవం వేడుకలలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో త్రినేత్ర ఆంజనేయస్వామి ఆలయ చైర్మన్ పెండ్యాల శ్రీనువాసు గౌడ్, శివాలయ చైర్మన్ ముద్దగౌని సతిష్ గౌడ్, అమరేందర్ రెడ్డి , జక్కిడి సంజీవ రెడ్డి ,జెగన్మోహన్ రావు ,మూర్తి, శర్మ, శివ ముదిరాజ్, యదగిరి, రమణ రెడ్డి, ఇంద్ర రెడ్డి, లక్శ్మిపతి, ఆవుల రమేష్, చిత్రంజన్, మారుతి, శశాంక్, వరలక్ష్మి, శాంతి, రాము, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News