Trending Now

టీఆర్ఎస్ మెదక్ ఎంపీ బరిలో రాష్ట్ర అధ్యక్షుడు కుమారుడు పోటీ..

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 22: ఎన్నికల హీట్ పెరుగుతున్న వేళ మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ (తెలంగాణ రాజ్యసమితి) అభ్యర్థి గా సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలకు చెందిన తుపాకుల మురళి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కొన్ని నెలల క్రితం సిద్దిపేట అర్బన్ మండలం, పొన్నాల గాంధీ నగర్ కు చెందిన తుపాకుల బాల్ రంగం టీఆర్ఎస్ (తెలంగాణ రాజ్యసమితి) పార్టీ పేరిట గుర్తింపు కావాలని ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ తర్వాత దరఖాస్తును గుర్తిస్తూ.. తెలంగాణ రాజ్యసమితి పేరిట గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయిస్తూ.. ఎన్నికల కమిషన్ అనుమతులు ఇచ్చింది. అప్పటి నుండి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాల్ రంగం కొనసాగుతున్నారు.

ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తుపాకుల మురళి కూడా పార్టీలో రాష్ట్ర ఉపాధ్యక్షుని గా కొనసాగుతున్నారు. తుపాకుల మురళి తమ్ముడి భార్య బీఆర్ఎస్ సిద్దిపేట అర్బన్ మండల జడ్పీటీసీగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. తుపాకుల బాల్ రంగం కూడా ఇంకా బీఆర్ఎస్ సభలకు హాజరవుతూనే టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడుగా పదవులు నిర్వహిస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ తో స్నేహపూర్వక మద్దతు ఉంటుందని ప్రకటించి.. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా మెదక్ నుండి తన కుమారుడిని బరిలోకి దింపడంతో రాజకీయంలో ఆసక్తి చర్చ మొదలైంది.

Spread the love

Related News

Latest News