Trending Now

హైదరాబాద్‌లో అనేక చోట్ల ‘నయవంచన’ అంటూ బ్యానర్లు..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని అనేక బహిరంగ ప్రదేశాల్లో బీజేపీకి వ్యతిరేకంగా బ్యానర్లు వెలిశాయి. వీటిని సామాన్యులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. బీజేపీకి వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ చార్జ్ షీట్ రూపంలో వీటిని విడుదల చేసింది. గాంధీభవన్ రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నేతలు ఈ పోస్టర్లను విడుదల చేశారు. దేశంలో లోక్​సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో.. తెలంగాణలో మళ్లీ ఫ్లెక్సీ వార్ మొదలైంది. బీజేపీని ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీని టార్గెట్ చేస్తూ.. గాంధీభవన్ ఎదుట అలాగే నగరంలో పలు చోట్ల ‘నయవంచన’ పేరుతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ‘‘పదేండ్ల మోసం – వందేళ్ల విధ్వంసం’’ అంటూ.. వెలసిన ప్లెక్సీలు, పోస్టర్లను నగర ప్రజలు ఆసక్తిగా చదువుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఈ పోస్టర్లలో ఎండగట్టారు.

బీజేపీ నయవంచన పేరుతో ప్రజా ఛార్జ్‌షీట్‌ని గాంధీభవన్​లో గురువారం నాడు కాంగ్రెస్‌ ఆవిష్కరించింది. ‘పదేళ్ల మోసం- వందేళ్ల విధ్వంసం’ అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్‌షీట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా.. కృష్ణా జలాల్లో వాటా, ఏటా రెండు లక్షల ఉద్యోగాలు, పదేళ్లలో 113కోట్ల అప్పు వంటి అంశాలతో ఛార్జ్‌షీట్ లో పలు విషయాలను ప్రస్తావించింది.

Spread the love

Related News