Trending Now

‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని సీఎం శ్రీకారం..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: వ్యవసాయం, పంటలు, సస్యరక్షణ తదితరాలపై రైతులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రైతు నేస్తం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్​రెడ్డి ‘రైతు నేస్తం’కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి మాట్లాడుతూ.. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమమే ‘రైతు నేస్తం’అని తెలిపారు. దశలవారీగా 3 సంవత్సరాల్లో 2,601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ. రూ.97 కోట్లు కేటాయించారు.

మొదటి దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ. 4.07 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. వ్యవసాయాన్నిలాభసాటిగా మార్చేందుకు, రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్‌ ఫ్లాట్‌ ఫారం ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు జరపనున్నారు. గ్రామాల నుంచే రైతులు ఆన్‌లైన్‌లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవటం, తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు.

Spread the love

Related News

Latest News