Trending Now

“పది”లో రాష్ట్రంలోనే రెండో స్థానం..

వరుసగా ఐదు సార్లు అగ్రస్థానంలో సిద్దిపేట..

విద్యాశాఖ అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి హరీశ్ రావు

ప్రతిపక్షం, సిద్దిపేట, ఏప్రిల్ 30: పది ఫలితాల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థులు గత స్ఫూర్తిని చాటి చెప్పారు. సిద్దిపేట జిల్లా మరో సారి రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా సత్తా చాటారు. నేడు విడుదల అయిన పది ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రెండవ స్థానంలో నిలిచింది.గత సంవత్సరం కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది.గత సంవత్సరం 98.65% ఉత్తీర్ణత శాతం రాగ ఈ సంవత్సరం 98.68% తో గత సంవత్సరం కంటే 0.3% పెరిగింది.ఇది మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు నిరంతరం పర్యవేక్షణ , విద్యార్థులకు డిజిటల్ క్లాస్ లు, ప్రత్యేక తరగతులు, తల్లి తండ్రులకు ఉత్తరం అదేవిధంగా కాన్ఫరెన్స్ ద్వారా నింపిన ఆత్మవిశ్వాసం తో పదిలో పంథా తగ్గలేదు . అదే స్ఫూర్తితో మరో సారి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది.అంతకు ముందు రెండు సంవత్సరాలు 2, 3 స్థానాలు, ఆ తర్వాత 1వ స్థానం, గత ఏడాది రెండో స్థానంలో నిల్వగా ఈసారి కూడా గత స్థాయిని పదిలంగా ఉంచుకొని వరుసగా ఐదు సార్లు రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. అభివృద్ధి లో సిద్దిపేట అగ్రస్థానంలో ఉండటం ఎంత ముఖ్యమో విద్య లో ముందు ఉండాలనే హరీష్ రావు సంకల్పానికి నిదర్శనం.పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోయేంత మాత్రాన జరిగిన నష్టం ఏమీ లేదు. మరోసారి పరీక్ష రాసి పాస్ కావచ్చు. ఎవరు తీవ్ర చర్యలకు పాల్పడవద్దని విద్యార్థులకు మనవి తల్లిదండ్రులు పిల్లల్ని మందలించకుండా ప్రేమతో వ్యవహరించండి.

ఫలితాలపై హరీష్ రావు ప్రత్యేక చొరవ..

నిరంతరం ఫలితాలపై మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపారు.విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా తల్లి తండ్రులకు, కాన్ఫరెన్స్, ఉత్తరం, డిజిటల్ క్లాస్, ప్రత్యేక తరగతులు, స్నాక్స్ ఏర్పాటు చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు పదో తరగతి వ్యవస్థను గాడిలో పెట్టారు. అదే రూట్లో నేడు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా శాఖ యంత్రాంగం అడుగులు వేసి సక్సెస్ సాధించారు.

సిద్దిపేట నియోజకవర్గంపై ప్రత్యేక పోకస్..

సిద్దిపేట జిల్లా అదే పంథాలో పోవాలనే ఉద్దేశ్యంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ద్రుష్టి సారించారు.ముఖ్యం గా సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచే హరీష్ రావు ప్రత్యేక పోకస్ పెట్టారు. అందులో భాగంగా సిద్దిపేట నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, డిజిటల్ కంటెంట్ బుక్స్, స్నాక్స్ తన స్వంత డబ్బులతో ఏర్పాటు చేశారు. ఆ దిశగా సిద్దిపేట నియోజకవర్గం ఉత్తమ ఫలితాన్నిసాధించింది. సిద్దిపేట అర్బన్, నారాయణ రావుపేట, చిన్న కోడూరు, నంగునూర్, మున్సిపాలిటీ లో 100% ఉత్తిర్ణత సాదించింది. సిద్దిపేట రూరల్ 99.97% వచ్చింది. మొత్తం సిద్దిపేట నియోజకవర్గం ఉత్తమ ఫలితాలు సాదించింది.

జిల్లా గౌరవాన్నినిలబెట్టారు..

ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు..

శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు

మరోసారి సిద్దిపేట జిల్లా గౌరవాన్ని చాటారని పదో తరగతి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతు పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు. నేడు విడుదలైన ఫలితాలలో రెండవ స్థానంలో సిద్దిపేట జిల్లాను నిలిపిన విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండి, వారిని సన్మార్గంలో నడిపిస్తూ, పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు అభినందనలు. నిరంతరం జిల్లా యంత్రాంగాన్ని పర్యవేక్షణ చేసిన జిల్లా కలెక్టర్ కి , విద్యాశాఖకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ స్పూర్తిని నిరంతరం కొనసాగించాలి.

విద్యార్థుల తల్లితండ్రులతో ఆత్మీయంగా మాట్లాడిన హరీష్ రావు..

పదిలో పాసైనా సంతోషంలో ఉన్న విద్యార్థులు, తల్లితండ్రులతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాన్ఫరెన్స్ నిర్వహించారు.మీ బిడ్డ ను డాక్టర్ చేస్తావా.. మీ కొడుకుని ఇంజనీర్ చెయ్ అంటూ ఆత్మీయంగా మాట్లాడారు. మీ బిడ్డ పాసైంది శుభాకాంక్షలు, సంతోషం గా ఉన్నావా.. దావత్ ఎప్పుడు ఇస్తావ్ ఇంటికి రావాలా అంటూ ఆత్మీయంగా ముచ్చటించారు.

Spread the love

Related News