Trending Now

యుద్ధ ప్రతిపాదికన ముందస్తు చర్యలు..

జేసీబీ సహాయంతో పారిశుద్ధ్య పనులు..

లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 7 : వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా నిర్మల్ పురపాలక శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకోవడం మొదలైంది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రధాన, అంతర్గత వీధులలో మురికివాడలకు లోతట్టు ప్రాంతాలకు అనుకొని వెళ్తున్న మురికి కాలువలు, కుంటాలను జెసిబి సహాయంతో శుభ్రం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తా, విద్యానగర్, ఈద్గాం, ఆదర్శనగర్, సోఫీ నగర్, కురన్నపేట్, ఇస్లాం పుర, గాజులపేట్ ,వైయస్సార్ కాలనీ, అస్రాకాలనీ, సిద్దాపూర్, జీఎన్ఆర్ కాలనీ తదితర ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రణాళిక బద్ధమైన రీతిలో ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

ముఖ్యంగా ప్రతి వర్షాకాలంలో జలమయమై తీవ్ర అసౌకర్యాలకు కారణమవుతున్న గొల్లపేట, మంచిర్యాల చౌరస్తా, విద్యానగర్, ఆదర్శనగర్ ల గుండా సాగుతున్న భారీ మురికి నీటి కాలువను శుభ్రం చేసే పనులను శుక్రవారం నిర్మల్ స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ అబ్దుల్ మతిన్ మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, సానీట రీఇన్స్పెక్టర్ దేవిదాస్, స్థానిక జవాన్ శేఖర్ ఆధ్వర్యంలో అందులో నిండిపోయిన పూడిక ఇతర వ్యర్థాలను తొలగించి మురికి నీరు వర్షపు నీరు సులభంగా పారేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ భారీ మురికి కాలువలో పూడిక ఇతర వ్యర్థాలు నిండిపోవడంతో సాధారణ వర్షాలు కురిసిన గొల్లపేట, మంచిర్యాల చౌరస్తా, విద్యానగర్, ఆదర్శనగర్ లోని పలు ప్రాంతాలు జలమయమై గంటల తరబడి స్థానికులు పడరాని పాట్లు పడక తప్పడం లేదు. ఒక సందర్భంలోనైతే మంచిర్యాల చౌరస్తాలో వర్షాలు కుడిచినప్పుడు రెండు ఫీట్ల మేర ఎత్తులో నీరు నిండిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతూ వస్తుంది. దీంతోపాటు సోఫీ నగర్ లోని లోతట్టు ప్రాంతంలో కూడా సాధారణ వర్షాలకే జనావాసాలు జనమయమై స్థానికులు ప్రతి ఏడు పడరాని పాట్లు పడుతున్నారు.

లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి..! సుమారు నాలుగు సంవత్సరాలుగా కురుస్తున్న వర్షాల కారణంగా వర్షాకాలం మొత్తం జలమయమై అతలాకుతలమవుతున్న నిర్మల్ జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి యుద్ద ప్రతిపాదికన పూడికతీత, మురికి కాలువల శుభ్రత, వర్షపు నీరు నిల్వకుండా తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలైన విద్యానగర్, గొల్లపేట్, ఆదర్శనగర్ సోఫీ నగర్ ,ఇస్లాంపూర, కురన్నపేట్, వైయస్సార్ కాలనీ, గాజులపేట్, రాంనగర్ తదితర ప్రాంతాలలో ఉన్న భారీ ,సాధారణ మురికి కాలువలలో నిండిన పూడిక ఇతర వ్యర్థాలను తొలగించడంతో పాటు ఆ పరిసరాల్లో ఉన్న మురికి కోపాలు చెత్తాచెదారని తొలగించేందుకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నారు.

Spread the love

Related News

Latest News