ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: జ్యోతిరావు పూలేకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో కోహెడ నర్సింగ్ హోమ్ లో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో హాస్పిటల్లో ఉన్నరోగులకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే జయంతి198 సందర్భంగా నేటి యువత వారి ఆదర్శం తీసుకోవాలని కోరారు. పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసిన యోధుడని జ్యోతిరావు పూలే అనేక పోరాటాలు చేసి పెతందారి వ్యవస్థను రూపుమాపిన గొప్ప పోరాట యోధుడని అన్నారు. ఈ కార్యక్రమంలో కోహిడ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ బద్దం తిరుపతిరెడ్డి, సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ కోహెడ మండల కోఆర్డినేటర్ జాప మల్లారెడ్డి, సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల శంకర్, కోహిన మండల మాజీ అంబేద్కర్, అధ్యక్షులు మంద మల్లేశం, హాస్పిటల్ సిబ్బంది, సంకల్ప సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.