వారణాసిలో నామినేషన్ వేసిన మోదీ..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి బీజేపీ తరఫున వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. కాగా, వారణాసిలో జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది.

కాల బైరవ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు..

నామినేషన్ పత్రాలు దాఖలకు ముందు అంతకంటే ముందు ఆయన అస్సీఘాట్‌లో గంగాదేవికి ప్రత్యేక హారతి ఇచ్చారు. వేద పండితులు ప్రత్యేక మంత్రోచ్ఛరణ మధ్య మోదీ గంగాదేవికి చీరసారే సమర్పించి ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం కాల భైరవ ఆలయానికి వెళ్లిన ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు.

Related News

Latest News