ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 20 : నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య రీతిలో పుంజుకుంటుంది. బీఆర్ఎస్‌తో విసుగు చెందిన నాయకులు, కాయ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హస్తం గూటికి చేరుతున్నారు. శనివారం రత్నపూర్ కాండ్లి గ్రామనికి చెందిన మండల మాజీ కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ సమీర్, మాజీ వార్డ్ సభ్యులు సయ్యద్ నిజాముద్దీన్, మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ అలీమ్, సయ్యద్ కరీం, హఫీజ్‌లతో పాటు పలువురు మైనార్టీ ముస్లిం లు మండలంలోని రత్నాపూర్ కాండ్లి మాజీ సర్పంచ్ కొండ్రు రాంరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజాపాలన అందిస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో సయ్యద్ కరీం, గ్రామ యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.