ప్రతిపక్షం,వేములవాడ, నవంబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి మరియు విస్తరణ పనుల నిమిత్తం దేవరాజ్, ఉమా బాలచందర్ దంపతులు లక్షా నూట పదహారు రూపాయల (1,00,116) విరాళాన్ని అందజేశారు.
యూఎస్ఏ లో ఉంటున్న తమ మనుమడు అవ్వాన్ అన్నప్రాసన వేడుక సందర్భంగా వారు ఈ విరాళాన్ని అందజేయాలని సంకల్పించారు. ఈ మేరకు ఆలయ ఈవో రమాదేవి గారికి వారు చెక్కు రూపంలో విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ఈవో రమాదేవి, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, ఆ దంపతులకు శేషవస్త్రం అందజేసి, స్వామివారి లడ్డు ప్రసాదాన్ని బహూకరించారు.





























