మంజీరా నదిలో తల్లి, ఇద్దరు కుమార్తెలు గల్లంతు

ఏడుపాయల మొదటి బ్రిడ్జి వద్ద ఘటన.. నదిలో పోలీసుల గాలింపు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్, అక్టోబర్ 28: మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ శివారులోని ఏడుపాయల మొదటి బ్రిడ్జి వద్ద మంజీరా నదిలో తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి గల్లంతైన విషాద ఘటన కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామానికి చెందిన సరిత (25), ఆమె కుమార్తెలు వైష్ణవి, శ్రావణిక ఆచూకీ కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సరిత గల్లంతైనట్లు ఎల్లారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ఏడుపాయల మొదటి బ్రిడ్జి వద్ద ఆమె ఆచూకీ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నది ఒడ్డున ముగ్గురికి చెందిన చెప్పులు, సెల్‌ఫోన్‌ లభించడంతో వారు నదిలో గల్లంతై ఉంటారని అనుమానిస్తున్నారు.సమాచారం అందుకున్న రూరల్‌ సీఐ, కొల్చారం ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

అనంతరం పోలీసు, అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్ల సహాయంతో మంజీరా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు రెండు గంటలపాటు గాలించినప్పటికీ ముగ్గురి ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలను తాత్కాలికంగా నిలిపివేసి, బుధవారం ఉదయం తిరిగి ప్రారంభించారు ముగ్గురు మృతదేహాలను దొరికిన అనంతరం మెదక్ ఏరియా హాస్పిటల్ కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సరిత ఆధార్‌ కార్డులో సవరణ చేయించుకునేందుకు పోచారంలో ఉంటున్న తన అక్క వద్దకు రావడం జరిగింది. అనంతరం ఇతరులు ఫోన్ చేసి ఆ సమాచారంతో ఏడుపాయలకు చేరుకుంది ఆ క్రమంలో ఏడుపాయల సమీపంలోని మంజీరా నది వద్దకు చేరుకున్న ఆమె, పిల్లలతో సహా మంజీరా డ్యాంలో మంజీరా నది గల్లంతయింది ఒడ్డు పైన చెప్పులు ఆధార్ కార్డు సెల్ఫోన్ ఉండడంతో పోలీసులు గుర్తించి నదిలో గాలింపు చర్యలు జరపడం జరిగిందని బంధువులు తెలిపారు.సరిత భర్త గుండెపోటుతో మృతి చెందడంతో ఆమె హైదరాబాద్‌లో ఒంటరిగా జీవిస్తున్నట్లు తెలిసింది. గల్లంతైన చిన్నారుల్లో వైష్ణవి ఐదో తరగతి, శ్రావణిక నాలుగో తరగతి చదువుతున్నారు. తల్లి, ఇద్దరు చిన్నారులు గల్లంతైన ఘటనతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో మునిగిపోయారు.

ఈ సందర్భంగా మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ. మంజీరా నదిలో ఇద్దరు పిల్లలతో సహా సరిత గల్లంతైన ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికితీసి. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.ఆవేశంలో ఆత్మహత్యలకు పాల్పడి కుటుంబాలను విషాదంలోకి నెట్టవద్దని మహిళలు, యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమస్య ఎదురైతే పోలీసులను నేరుగా సంప్రదించి సహాయం కోరవచ్చని సూచించారుకుటుంబ సమస్యల కారణంగా చిన్నారులను వెంటబెట్టుకొని ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని పేర్కొన్నారు. పిల్లలను అనాథాశ్రమాల్లో లేదా ప్రభుత్వ బాలసదనాలు, వసతి గృహాల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే అవకాశం ఉందని తెలిపారు. ఆవేశపూరిత నిర్ణయాలు చిన్నారుల జీవితాలను కూడా అంధకారంలోకి నెడతాయని డీఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News