ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 9 : గోషామహల్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు రాజాసింగ్ ఆయన తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు అయింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బుధవారం రాత్రి నిర్వహించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎన్నికల ప్రచార కార్యక్రమం రోడ్ షో లో వారు ఎన్నికల ప్రవర్తన నియమవాళీని ఉల్లంఘించారని అందుకు సంబంధించిన పూర్తిస్థాయి ఆధారాలను గుర్తించి ఖానాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక రిటర్నింగ్ అధికారి ఇచ్చిన సమయాన్ని ఉల్లంఘించారని ఖానాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ లింబాద్రి తెలిపారు. దీంతో బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ,ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ , గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ,భారతీయ జనతా పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ అంకం రాజేందర్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లింబాద్రి వివరించారు.