ప్రతిపక్షం, ఆగస్టు 10: మాస్ మహారాజా రవితేజ, శ్రీవిష్ణు కలిసి నటించనున్న మల్టీస్టారర్ మూవీపై ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ‘రాజ రాజ చోర’ ఫేమ్ హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ తొలి వారంలో సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. చిత్రీకరణను వేగంగా పూర్తి చేసి సుమారు మూడు నెలల్లో షూటింగ్ మొత్తం ముగించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు టాక్. రవితేజ, శ్రీవిష్ణు కలిసి నటిస్తుండటంతో ఈ మల్టీస్టారర్‌పై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
కాగా ఈ సినిమాకు ‘వీరాధి వీరులంట: కేరాఫ్ మహిళా మండలి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే టైటిల్, విడుదల తేదీ, షూటింగ్ షెడ్యూల్‌పై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.





























