Trending Now

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం..

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 20: పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్ గాంధీ ప్రధాని ఖచ్చితంగా అవుతారని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ, మక్సూద్ అహ్మద్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ధీమా వ్యక్తం చేశారు. సిద్ధిపేటలో శనివారం కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు సీఎం రేవంత్ రెడ్డి తో కలిసి నామినేషన్ సందర్భంగా వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాది వాహనాల్లో భారీ సంఖ్యలో తరలి వెళ్లారు.

వాహనాలను పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మక్సూద్ అహ్మద్, పూజల హరికృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెంచి సామాన్యుల నడిచారని అన్నారు. జన్ దన్ అంటూ మహిళల అకౌంట్లోకి డబ్బులు వేస్తామని ఆశ చూపిన మోడీ పదేళ్ల పాలనలో ఆదానీ, అంబానీలకు దేశాన్ని దోచి పెట్టారని అన్నారు. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని దేశ ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని అన్నారు.

మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు భారీ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నాయకులు, కార్యకర్తలు ప్రతి గడపకు తీసుకువెళ్లాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరహాలోని మరింత మెజార్టీ వచ్చేలా అందరం సమిష్టి కృషితో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొమ్మల యాదగిరి, మార్గ సతీష్ గౌడ్, ముద్దాం లక్ష్మి, కౌన్సిలర్ సాక్షి, ఆనంద్, బుచ్చిరెడ్డి, రియాజ్, మీసం నాగరాజు, తప్పేట శంకర్, బర్మా రామచంద్రం, రాములు, అంజిరెడ్డి, గయాజుద్దీన్, వహాబ్, రషీద్, హర్షద్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News