[t4b-ticker]

పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు.. అర్హతలు ఇవే!

ప్రతిపక్షం, ఆగస్టు 08: తెలంగాణలో కొత్తగా పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. వివిధ కేటగిరీలకు చెందిన అర్హులైన వారు నిర్దేశిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

వితంతువులు: భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.

భర్తతో విడిపోయిన వారు, విడాకులు పొందినవారు: కనీసం ఏడాది కాలంగా భర్తకు దూరంగా ఉంటున్నట్లు తహసీల్దార్ విచారణ నివేదిక సమర్పించాలి.

వివాహం కాని మహిళలు: 30 నుంచి 35 ఏళ్ల వయసు ఉండాలి.

దివ్యాంగులు: సదరం ధ్రువీకరణ పత్రంలో 40 శాతానికి పైగా వైకల్యం ఉన్నట్లు నమోదు అయి ఉండాలి.

చేనేత, గీత కార్మికులు: 50 ఏళ్లు పైబడిన వారు సంబంధిత సొసైటీ సభ్యత్వం, వృత్తికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలి.

అర్హత ఉన్న వారు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు.

Spread the love

Related News

Latest News