తండ్రి కొడుకుల “చేతి”లోనే గోమాస ఓటమి..

2009 లో వివేక్ వెంకటస్వామి చేతిలో

2024లో వంశీకృష్ణ చేతిలో

ప్రతిపక్షం, మంథని, జూన్ 05 : రెండు సార్లు పెద్దపల్లి ఎంపీగా పోటీచేసిన గోమాస శ్రీనివాస్ ఆ రెండు సార్లు తండ్రి కొడుకుల చేతిలో ఓటమి పాలయ్యాడు. 2009లో తెరాస పార్టీ నుండి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన గోమాస శ్రీనివాస్, దివంగత నేత, కాకా గడ్డం వెంకటస్వామి వారసత్వాన్ని కొనసాగిస్తూ మొదటిసారిగా పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన డా.గడ్డం. వివేక్ వెంకటస్వామి చేతిలో ఓటమిపాలయ్యాడు. తిరిగి 2024లో బీజేపీ పార్టీ నుండి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోమాస శ్రీనివాస్, కాకా గడ్డం వెంకటస్వామి మనవడు, డా.గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడైన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చేతిలో రెండవ సారి ఓటమి పాలయ్యాడు. ఇలా పోటీ చేసిన రెండుసార్లు తండ్రి, కొడుకుల చేతిలో గోమాస శ్రీనివాస్ ఓటమి పాలయ్యాడని పార్లమెంట్ నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది.

Related News

Latest News