ప్రతిపక్షం, జూన్ 04: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్‌కు సంబంధించిన అప్రమత్తత చర్యలు చేపట్టారు. గతంలో ఎబోలా వ్యాధి చరిత్ర ఉన్న సుడాన్‌కు చెందిన ఓ ప్రయాణికుడిని విమానాశ్రయ అధికారులు గుర్తించారు.
అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యగా అతడిని తిరిగి స్వదేశానికి పంపించినట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్ ప్రక్రియలు కట్టుదిట్టంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎలాంటి ప్రమాద పరిస్థితి లేదని అధికారులు తెలిపారు.

















