ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు.. మహిళా ఉద్యోగులకు మంత్రి సీతక్క సూచన

ప్రతిపక్షం, జూలై 15: మహిళా ఉద్యోగులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. తెలంగాణ సచివాలయ మహిళా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటి బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతల మధ్య మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదన్నారు. అనారోగ్యం వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందుగానే ఆరోగ్య పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని చెప్పారు.

ప్రతి మహిళ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు.

Spread the love

Related News

Latest News