ప్రతిపక్షం, జూలై 02: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పేపర్‌లెస్ విధానంలో ఈ-క్యాబినెట్ సమావేశం నేడు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులు ట్యాబ్‌ల ద్వారా క్యాబినెట్ అజెండాను పరిశీలించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ విధానంతో ప్రభుత్వ పాలనలో డిజిటల్ సాంకేతికత వినియోగానికి మరింత ప్రాధాన్యం లభించనుంది.
ఈ సమావేశంలో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి దశ పనులు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, వీబీ జీ రామ్‌జీ పథకం అమలు, రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, రైతులకు ప్రోత్సాహకాలు తదితర కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

















