Trending Now

హుస్నాబాద్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు..

ప్రతిపక్షం, హుస్నాబాద్ ఏప్రిల్ 17 : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ శివ భక్త మార్కండేయ.. శ్రీ సీతారామచంద్ర ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శ్రీ సీతారాముల దీవెనలు మనందరిపై ఉండాలని.. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని.. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు కొంకటి నళిని దేవి, బోజు రమాదేవి, కోమటి స్వర్ణలత, పెరుక భాగ్య రెడ్డి, పున్నలావణ్య సది, చిత్తారి పద్మ, మ్యాదర బోయిన వేణు,మ్యాదర బోయిన శ్రీనివాస్, గోవింద రవి, దొడ్డి శ్రీనివాస్, గూళ్ళ రాజు, బొల్లి కల్పన, భూక్య సరోజన, జనగామ రత్నమాల, వల్లపు రాజు, మిరియాల రమేష్, వాలా సుప్రజా నవీన్ రావు, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, కో ఆప్షన్ సభ్యులు ఐలేని శంకర్ రెడ్డి,యండి ఆయూబ్ పాషా, కాషాబోయిన లలిత, బొల్లం శ్రీలత కోఆప్షన్, నాయకులు, పురపాలక సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News