ప్రతిపక్షం, స్పోర్ట్స్: రాంచీ వేదికగా జరుగుతోన్న నాలుగవ టెస్ట్ తొలి ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండ్ 353 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ సెంచరీ (122)తో నాటౌట్‌గా నిలిచాడు. ఆల్ రౌండర్ ఓలీ రాబిన్‌సన్ (58)తో రాణించాడు. జాక్ క్రాలే 42, బెయిర్ స్టో 38, బెన్ ఫోక్స్ 47 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో.. అరంగ్రేట బౌలర్ ఆకాష్ దీప్ 3 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేయగా.. స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా 4 వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాటర్లను వరుసగా పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్ 2, అశ్విన్ ఒక వికెట్ తీశారు.
అనంతరం భారత్ బ్యాటింగ్‌కు దిగింది. కాగా, ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భారత్ రెండింట్లో విజయం సాధించగా.. ఇంగ్లాండ్ జట్టు ఓ మ్యాచ్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో నెగ్గి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతుండగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది.