CM Chandrababu press meet: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోదీకి వివరించినట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను ఆయన కలిశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదేళ్లలో జరిగిన విధ్వంసం గురించి ప్రధాని మోదీకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ – 2047 పై ప్రధాని మోదీకి వివరించాన్నారు. పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. గత ప్రభుత్వం తీరుతో రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాళా తీసిందని, ఏపీలో చెత్త నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. దీంతో రాష్ట్రంలో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, ఐదేళ్లుగా కేంద్ర పథకాలను వైసీపీ ప్రభుత్వం వినియోగించుకోలేదన్నారు. దీంతోపాటు హౌరా- చెన్నై రైల్వే లైన్ పై చర్చించామని చంద్రబాబు తెలిపారు.