Trending Now

అక్కడ పోటీ చేసి తేల్చుకుందాం.. సీఎం రేవంత్‌కి కేటీఆర్​ సవాల్

హైద‌రాబాద్, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్ విసిరారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి తాను రాజీనామా చేస్తాను. సీఎం ప‌ద‌వికి రేవంత్ రాజీనామా చేయాలి. మ‌ల్కాజ్‌గిరి ఎంపీ స్థానంలో ఇద్ద‌రం పోటీ చేద్దాం. మీ సిట్టింగ్ సీటు మ‌ల్కాజ్‌గిరిలోనే తేల్చుకుందాం.. సేఫ్ గేమ్ వ‌ద్దు.. డైరెక్ట్ ఫైట్ చేద్దామంటూ రేవంత్‌కు కేటీఆర్ స‌వాల్ విసిరారు.గ‌తంలోనూ రేవంత్ స‌వాల్ చేసి పారిపోయారు. కొడంగ‌ల్, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో స‌వాల్ చేసి రేవంత్ పారిపోయారు. స‌వాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాట‌కు విలువేముంది..? త‌న‌ది మేనేజ్‌మెంట్ కోటా అయితే.. రాహుల్, ప్రియాంక గాంధీది ఏం కోటా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌ది పేమెంట్ కోటా.. డ‌బ్బులిచ్చి ప‌ద‌వి తెచ్చుకున్నారు. పేమెంట్ కోటా కాబ‌ట్టే రేవంత్ ఢిల్లీకి పేమెంట్ చేయాలి. బిల్డ‌ర్లు, వ్యాపారుల‌ను బెదిరించి ఢిల్లీకి రేవంత్ క‌ప్పం క‌ట్టాలి. రేవంత్ సెస్‌పై త్వర‌లో బిల్డర్లు, వ్యాపారులు రోడ్డెక్కుతారు అని కేటీఆర్ పేర్కొన్నారు. మా ప్రభుత్వంలో కొన్ని త‌ప్పులు జ‌రిగి ఉండొచ్చు. ప్రభుత్వంలో అన్నీ సీఎం, మంత్రుల‌కు తెలియాల‌ని లేదు. త‌ప్పులు జ‌రిగాయ‌నుకుంటే విచారించి చ‌ర్యలు తీసుకోండి. మార్చి 2 నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్య‌ర్థిత్వాల‌పై క‌స‌ర‌త్తు చేస్తాం. ఎంపీ అభ్యర్థిత్వాల‌పై కేసీఆర్ స‌మావేశాలు నిర్వహిస్తార‌ని కేటీఆర్ తెలిపారు.

Spread the love

Related News

Latest News