ప్రతిపక్షం, వెబ్ డెస్క్: రోజూ తన కాన్వాయ్ తనిఖీ చేసిన పోలీసులకు ఒక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘన అయినా కనిపించిందా..? అని నారా లోకేశ్ ప్రశ్నించారు. ‘సీఎం ఇంట్లోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన కంటైనర్‌ను ఎందుకు తనిఖీ చేయలేదు..? అందులో ఏముంది..? బ్రెజిల్ సరుకా..? లిక్కర్లో మెక్కిన రూ.వేల కోట్లా..? లండన్ పారిపోయేందుకు ఏర్పాట్లా..? ఏపీ సెక్రటేరియట్‌లో ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్లా..? సమాధానం చెబుతారా డీజీపీ?’ అని ట్వీట్ చేశారు.