Trending Now

వ‌న‌దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న గ‌వ‌ర్నర్ త‌మిళిసై..

ప్రతిపక్షం, తెలంగాణ: రాష్ట్ర గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్, కేంద్ర గిరిజ‌న సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాలు దగ‌ద్దెల‌పై కొలువై ఉన్న స‌మ్మక్క-సారక్క, ప‌గిడిద్దరాజు, గొవింద‌రాజుల‌ను ద‌ర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉద‌యం 11.05 నిమిషాల‌కు మేడారం మ‌హా జాత‌ర‌కు చేరుకున్న గ‌వ‌ర్నర్‌కు హెలీప్యాడ్ వ‌ద్ద మంత్రి సీతక్క, బీజేపీ చేరిక‌ల క‌మిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ఎస్పీ శబరిష్, ఇతర ఉన్నత పోలీస్ అధికారులు పూజారులు స్వాగ‌తం ప‌లికారు. గ‌ద్దెల‌ వద్దకు చేరుకున్న గ‌వ‌ర్నర్ వ‌న‌దేవ‌త‌ల‌కు ప‌ట్టు వ‌స్త్రాలు, ఎత్తు బెల్లం( బంగారం) స‌మ‌ర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

Spread the love