ప్రతిపక్షం, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర పనులను మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక సూచనలు చేశారు. శానిటేషన్, త్రాగునీరు, పరిసర ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచాలని.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టీ. మల్లికార్జున్, వైస్ చైర్ పర్సన్ అనిత, శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్లు పున్నసది లావణ్య, గోవింద రవి, వల్లపు రాజు, మ్యాదరబోయిన వేణు, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, నాయకులు నవీన్ రావు, మున్సిపల్ సిబ్బంది, బాలఎల్లం, తదితరులు పాల్గొన్నారు.