ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణ గవర్నర్ తమిళి సై రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె తెలంగాణకు గవర్నర్ గా ఉండడంతో పాటు పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు. రాష్ట్రపతికి ఆమె తన రాజీనామా లేఖను పంపారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటి చేసేందుకు ఆమె తన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి ఆమె ఎంపీగా పోటి చేయనున్నారు. బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకే ఆమె రాజీనామా చేశారని తెలుస్తోంది.