Trending Now

ఇఫ్తార్ సామాగ్రి పంపిణీ..

ప్రతిపక్షం, కరీంనగర్ మార్చి 27: పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు సాయం చేస్తే అల్లా పుణ్య ఫలాలను ప్రసాదించి స్వర్గాన్ని ఇస్తాడని మజ్లీస్ తహఫుజ్ ఖత్మే నబువ్వత్ ట్రస్ట్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ముఫ్తి మహమ్మద్ ఘియాస్ మొహియుద్దీన్ అన్నారు. బుధవారం నగరంలోని 18వ డివిజన్ షేక్ ఖాన్ నగర్ రేకుర్తి మదర్సా అరబియా హిప్జుల్ ఖురాన్ లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 30 మారుమూల గ్రామాల్లో మజ్లిస్ తహఫుజ్ ఖత్మే నబువ్వత్ ట్రస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి మౌలాన అర్షద్ అలీ ఖాస్మి ఆదేశాల మేరకు ఉపవాస దీక్షలు పాటించే పేద ముస్లింల కోసం ఇఫ్తార్ సామగ్రిని పంపిణీ చేసినట్లు ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మజ్లిస్ తహఫుజ్ ఖత్మే నబువ్వత్ ట్రస్ట్ గడచిన 20సంవత్సరాలకు పైగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉపవాస దీక్షలు పాటించే పేద ముస్లింల సంక్షేమం కోసం విస్తృతంగా సేవలందిస్తోందన్నారు.

కరీంనగర్ లోని ఇస్లామీయ ధార్మిక పండితులతో పాటు ఉమ్మడి జిల్లాలోని 130 గ్రామాల్లో పని చేస్తున్న మస్జిద్ ఇమామ్ లకు, ఇస్లామీయ ధార్మిక పండితులకు రంజాన్ మాసంలో బియ్యం, వంట సామాగ్రిని పంపిణీ చేసినట్లు చెప్పారు. ఇమామ్ లకు వారి కుటుంబ సభ్యులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కొత్త బట్టలను అందించారు. ఉమ్మడి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింలను చేరదీసి ఇస్లామిక్ ఆధ్యాత్మిక సేవలను నిరంతరాయంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉపవాస దీక్షల వెసులుబాటు కల్పించేందుకు బియ్యం వంట సామాగ్రి దుస్తులు సైతం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాఫిజ్ హాఫిజ్ షేఖ్ అహ్మద్ హిప్జి, ముఫ్తి ఇంతియాజ్, అబ్దుల్ రాఫె, మహమ్మద్ రఫీ, హాఫిజ్ ఫరీద్, కలీం షరీఫ్, ముఖరం తదితరులు పాల్గొన్నారు.

Spread the love