Trending Now

ఆత్రం సుగుణ గెలుపు.. అభివృద్ధికి మలుపు

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్ ,మే 19 : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కొత్తపల్లి మాధవ రావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిదులుగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్యేయం అన్నారు. ఆత్రం సుగుణ నిరుపేద గిరిజన మహిళ ఆదిలాబాద్ చరిత్రలో మొదటి మహిళ ఆదిలాబాద్ పార్లమెంట్ కు పోటీ చేస్తుందన్నారు. మీరు వేసే ఓటు దేశ అభివృద్ధి తోడ్పడుతుందన్నారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తూ ప్రజలను ఐక్యం చేస్తుంటే నరేంద్ర మోదీ కుల మతాల పేరిట దేశ ప్రజలను విభజిస్తూ ఓట్లు దండుకుంటున్న బీజేపీ అన్నారు. పనికి ఆహార పథకం ప్రవేశపెట్టిన పార్టీ, ప్రాజెక్టులు కట్టి రైరులకు నిరందించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. బీజేపీ ప్రభుత్వ రంగా సంస్థలను అమ్మి, మన ఉపాధి ఉద్యోగాలను లేకుండా చేసిందని.. సంపద మొత్తం బహుళ జాతి కంపనీలకు దొచి పెట్టిన పార్టీ బీజేపీని ఓడించి చేతుగుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో ఆత్రం సుగుణ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా జడ్పీటీసీ ల పోరం అధ్యక్షులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ అయిర నారాయణ రెడ్డి, మాజీ జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు నల్లా వెంకట్ రాం రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దశరత్ రాజేశ్వర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త అల్లోల మురళిధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, పీఎసీఎస్ ఆలూర్ చైర్మన్ మాణిక్ రెడ్డి, వైస్ ఎంపీపీ పతాని రాధా భూమేష్, మాజీ అడెల్లి దేవస్థానం చైర్మన్ లు అయిటి చందు, ఉట్ల రాజేశ్వర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు అమర వేణి నర్సాగౌడ్, ముడుసు సత్యనారాయణ, అనుముల భాస్కర్, పాకాల రాంచంధర్, లక్కాకుల నరహరి, ముత్యం రెడ్డి, సర్పంచుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు వినోద్, మండల మాజీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్, పడిగేల రాజేశ్వర్, భూమా రెడ్డి, ఈశ్వర్, నక్క రాజన్న, డాక్టర్ సాయన్న, నవనీత్ రెడ్డి లతో పాటు మండల మాజీ సర్పంచ్ లు డైరెక్టర్స్ వార్డ్ మెంబర్స్, ఐదు వందల మంది కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News