Trending Now

రుణాల కోసం సర్కారు వేట..?

ఇందిరమ్మ ఇళ్లకోసం రూ.3 వేల కోట్ల రుణం

హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: తెలంగాణా ప్రభుత్వం రుణాల కోసం వేట ప్రారంభించింది. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన పలు పథకాలు అమలు కోసం నిధుల కోసం అన్వేషిస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం, గత సర్కారు ఆర్థిక నియంత్రణ పాటించకుండా భారీ ఎత్తున నిధులు ఖర్చుచేయడం, అలాగే కార్పొరేషన్లు తెరిచి అప్పులు తీసుకోవడంతో ప్రస్తుత ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదు. ఓ పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ.. మరో పక్క ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశలో సీఎం రేవంత్​రెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఈనెల 11న శ్రీకారం చుట్టబోతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మొదటి దశలో అవసరమయ్యే నిధులను హడ్కో నుంచి హౌసింగ్​ కార్పొరేషన్​​కు రూ.3వేల కోట్ల రుణానికి ఆర్జి పెట్టేశారు.

ఈ ఆర్జి మేరకు షరతులతో కూడిన రుణం మంజూరు చేస్తూ హడ్కో అనుమతులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పేదోడి స్వంత ఇంటి కల సాకారం కానుంది. మొదటి దశలో ప్రతీ నియోజకవర్గానికి 3,500చొప్పున ఇళ్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే!. ముందుగా స్వంత స్థలం ఉన్న లబ్ధిదారులను గుర్తించి దశల వారీగా ఇళ్లు పూర్తి అయ్యే వరకు రూ.5లక్షలు చెల్లించనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు రానున్నాయి.అయితే ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 6లక్షల ధరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

Spread the love

Latest News