ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఐపీఎల్ రసవత్తరంగా మారుతోంది. ఈరోజు లక్నో వేదికగా మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌ను LSG ఢీకొట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు 6మ్యాచులు ఆడి 4 గెలిచిన CSK 3వ స్థానంలో ఉంది. మరోవైపు ఆరింట్లో 3 గెలిచిన LSG 5వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ వైపు దూసుకెళ్లాలని రెండు జట్లూ భావిస్తున్నాయి. హెడ్‌టుహెడ్ రికార్డులు.. 1-1తో సమానంగా ఉన్నాయి. అందరి చూపు ధోనీపైనే ఉంది.
పంజాబ్ సూపర్ ఫైట్..
IPLలో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ నిన్న నమోదైంది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో పంజాబ్ తొలుత తడబడినా తర్వాత బలంగా నిలబడింది. 7 ఓవర్లకే టాప్, మిడిల్ ఆర్డర్లు కూలినా.. శశాంక్ 41(25), అశుతోశ్ 61(28) పోరాడటంతో ముంబైకి విజయం అంత సులువుగా దక్కలేదు. టెయిలెండర్లు సైతం MIని టెన్షన్ పెట్టారు. ఈ సీజన్‌లో ఢిల్లీ, RCB, GT, SRH, RRతో మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ ఆటను చివరి వరకు తీసుకొచ్చి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చింది.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ 9 రన్స్ తేడాతో విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ను ముంబై బౌలర్లు కట్టడి చేశారు. శశాంక్ 41(25), అశుతోశ్ 61(27) శ్రమించినా ఫలితం లేకపోయింది. దీంతో పంజాబ్ 183 రన్స్‌కే పరిమితమైంది. ముంబై బౌలర్లలో బుమ్రా, గెరాల్డ్ చెరో 3 వికెట్లతో రాణించారు. ఈ సీజన్‌లో MIకి ఇది మూడో విజయం కాగా, PBKSకు ఐదో ఓటమి.