Trending Now

ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడండి..

ఎస్ఎఫ్ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

ప్రతి పక్షం, దుబ్బాక, ఏప్రిల్ 19: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బుధవారం ఎస్ఎఫ్ఐ నాయకులపై ఏబీవీపీ గుండాల దాడిని నిరసిస్తూ.. గురువారం దుబ్బాక మండల పరిధిలోని రఘో త్తా0 పల్లి లో ఎస్ఎఫ్ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యదర్శి రాజు, భాను మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం ఏబీవీపీ చేస్తుందన్నారు.

అలాగే ఈ దేశంలో అందరికీ విద్యా, అందరికీ ఉపాధి కావాలని ఎస్ఎఫ్ఐ ఉద్యమిస్తే.. ఏబీవీపీ కులం, మతం పేరుతో విద్యార్థుల మధ్య చిచ్చు రేపుతుందన్నారు. ఎన్ని భౌతిక దాడులు చేసిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమాన్నిఆపలేరన్నారు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి అనే నినాదంతో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింద న్నారు. దేశంలో అన్ని యూనివర్సిటిలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల్లో గెలుపొందిన విషయం జీర్ణించుకోని ఏబీవీపీ గుండాలు ప్రతిసారి ఎస్ఎఫ్ఐ నాయకుల పై దాడి చేయడం సరికాదన్నారు. ఏబీవీపీ వారికి విద్యారంగంపైన శుద్ధి ఉంటే నూతన విద్యా విధానంపై చర్చ జరిపి రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అభిషేక్, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News