Trending Now

లైంగిక వేధింపుల కేసులో స్టార్‌ ఫుట్‌బాలర్‌కు జైలు శిక్ష..

ప్రతిపక్షం, స్పోర్ట్స్: లైంగిక వేధిం​పుల కేసులో స్టార్‌ ఫుట్‌బాలర్‌కు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది స్పానిష్‌ కోర్టు. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో బ్రెజిల్‌ మాజీ ఫుట్‌బాలర్‌ డానీ అల్వెస్‌కు (40) నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 13 కోట్ల జరిమానా విధించింది స్పెయిన్‌లోని బార్సిలోనా కోర్టు. 2022 డిసెంబర్‌ 31న అల్వెస్.. మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో (నైట్‌ క్లబ్‌లో) పాటు అనుమతి లేకుండా లైంగిక చర్యకు పాల్పడ్డాడని రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది.

Spread the love