ప్రతిపక్షం, తెలంగాణ: తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్‌గా ఎంపికైన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షులు, పాత్రికేయ కురు వృద్ధులు కె. శ్రీనివాస్ రెడ్డి గారికి ‘ప్రతిపక్షం’ దిన పత్రిక ప్రతినిధులు మంగళవారం ఆత్మీయ సన్మానం చేశారు. అభినందనలు తెలిపి శుభాకాంక్షలు అందజేశారు. బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యాలయం దేశోద్ధారకభవన్ లో ఈ కార్యక్రమం జరిగింది.