Trending Now

నిర్మల్ లో మళ్ళీ బీఆర్ఎస్ కు బిగ్ షాక్..

నిర్మల్ (ప్రతిపక్షం ప్రతినిధి) ఏప్రిల్, 14 : ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని పలు నియోజకవర్గాలలో కారు పార్టీ పూర్తిగా ఖాళీ అయింది. నిర్మల్ నియోజకవర్గం లోని ఆయా మండల పట్టణ స్థాయి ప్రజా ప్రతినిధులు పార్టీ ఆయా విభాగాల పదాధికారులు రాజీనామాలు సమర్పించి నేరుగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా ఖాజాగా నిర్మల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కోరిపల్లి రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాజీనామా పత్రాలను పంపారు. ఇందులో 15 మంది తాజా గ్రామ సర్పంచ్లు ఉండగా మండలంలోని ఆయా గ్రామాల ఎంపీటీసీలు బీఆర్ఎస్ ఆయా విభాగాల మండల గ్రామీణ స్థాయి పదాధికారులు నాయకులు సుమారు 70 మంది వరకు ఉన్నారు. వీరు రెండు రోజులలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు వివరించారు. రాష్ట్ర అధికార ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్నమైన సంక్షేమ పథకాలు కార్యక్రమాలకు ఆకర్షితులై అందరి ఏక నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు భవిష్యత్తు కార్యచరణ ప్రణాళిక రూపొందించినట్లు మండల పరిషత్ అధ్యక్షులు కోరిపల్లి రామేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు

Spread the love

Related News