Trending Now

మెగా మేనల్లుడు కొత్త ప్రొడక్షన్ హౌస్..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: హీరో సాయి ధరమ్ తేజ్.. గతేడాది ఆగస్టు 15 కు సత్య అనే ఫీచర్ ఫిల్మ్ ను తేజ్ రిలీజ్ చేశాడు. నరేష్ కుమారుడు, తేజ్ ఫ్రెండ్ అయిన నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ ఫీచర్ ఫిల్మ్ మంచి అవార్డులను కూడా అందుకుంది. అయితే తాజాగా ఈ ఇద్దరు స్నేహితులు కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించారు. నరేష్ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన విజయ నిర్మలలోని విజయను .. తేజ్ తల్లిపేరులోని దుర్గను తీసుకొని ‘విజయదుర్గ’ ప్రొడక్షన్ హౌస్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్నీ తేజ్.. అధికారికంగా ఎక్స్ లో అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Spread the love

Related News

Latest News