ప్రతిపక్షం, జూలై 14: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ లోక్‌సభ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా, ప్రజా నాయకుడిగా సమస్యల పరిష్కారానికి ముందుండి పోరాడిన నేతగా ఆయన సేవలను కొనియాడారు.
ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించిన సీఎం, ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపారు.

















