- కలెక్టర్ కు మొరపెట్టుకున్న గ్రామస్తులు
- భా రా స ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 08: మా ప్రాంతంలోని స్టీల్ కంపెనీ తొలగించి కాలుష్య బారినండి కాపాడాలని ప్రజలు వ్యాధుల బారి నుండి పడకుండా చూడాలని రంగాయీపల్లీ, చెట్ల గౌరారం. గ్రామ ప్రజలు భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షురాలు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి. మాజీ అటు విశాఖ అభివృద్ధి చైర్మన్ ఒంటరి ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో రంగాయీపల్లీ, చెట్ల గౌరారం. గ్రామ ప్రజలు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం చేసి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి ఒంటరి ప్రతాప్ రెడ్డిలు మాట్లాడుతూ రంగాయీపల్లీ, చెట్ల గౌరారం. గ్రామ పరిధిలోని ఎం /స్ అగ్రవాల్ ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్ రంగాయీపల్లీ, చెట్ల గౌరారం. కంపెనీ విస్తరణను నిలిపివేసి, ఆ కంపెనీని మా ప్రాంతం నుండి తొలగించాలని విజ్ఞప్తి చేశారు ఈ స్టీల్ కంపెనీ వల్ల గత కొంతకాలంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ కంపెనీ విస్తరణ చేపట్టాలని ప్రయత్నించడం వల్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందిని. వారు తెలిపారు.కంపెనీ నుండి వెలువడుతున్న కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. శ్వాసకోశ సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. అదేవిధంగా, కంపెనీ వల్ల ఏర్పడుతున్న గాలి, ధూళి మరియు భూగర్భ జలాలు పూర్తిగా దెబ్బతిన్నాయీ మరియు ఇతర కాలుష్యాల కారణంగా వ్యవసాయ భూములు దెబ్బతిని పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని. వారు అన్నారుఈ కంపెనీ ప్రభావం చేత రంగాయీపల్లీ, చెట్ల గౌరారం.పరిసర ప్రాంతాల్లోని దాదాపు నాలుగు గ్రామాల ప్రజలపై పడుతోంది. వేలాది మంది ప్రజలు ఈ కాలుష్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.అంతేకాకుండా, కంపెనీ విస్తరణకు సంబంధించి నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించడం వల్ల ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోయారు. భయాందోళనల మధ్య నిర్వహించిన ఆ ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిందని వారు తెలిపారు.ఈ కంపెనీ విస్తరణకు సంబంధించి ఇప్పటికే రెండు సార్లు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఆ రెండు సందర్భాల్లో కూడా మేము గ్రామ ప్రజలందరం ఏకగ్రీవంగా కంపెనీ విస్తరణను వ్యతిరేకిస్తూ మా అభ్యంతరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. అయినప్పటికీ, ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కంపెనీకి విస్తరణకు అనుమతి ఇవ్వడం వారు తెలిపారు. వెంటనే ప్రజల డిమాండ్ మేరకు కంపెనీ మూసివేయాలని లేదా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో.రంగాయీపల్లీ, చెట్ల గౌరారం గ్రామ ప్రజలతోపాటు భారత రాష్ట్ర సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు.




















