రైతుభరోసా దరఖాస్తులకు నేడే చివరి అవకాశం

ప్రతిపక్షం, జూలై 05: కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు, అలాగే సాంకేతిక కారణాలతో గతంలో రైతుభరోసా పొందలేని రైతులు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. అర్హులైన రైతులు సమీప వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) కార్యాలయం లేదా రైతు వేదికలో పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, బ్యాంక్ ఖాతాతో అనుసంధానమైన మొబైల్ నంబర్ వివరాలను సమర్పించాలి. దరఖాస్తు చేసిన అర్హులందరికీ రైతుభరోసా అందజేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

Spread the love

Related News

Latest News