ఎస్టీ రిజర్వేషన్ల స్వర్ణోత్సవం.. సీఎం రేవంత్‌ను కలిసిన బస్సు యాత్ర ప్రతినిధులు

ప్రతిపక్షం, జూన్ 24: తెలంగాణలో లంబాడి, ఎరుకల, యానాది తెగలకు రిజర్వేషన్లు అమలై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించనున్న స్వర్ణోత్సవ వేడుకల నేపథ్యంలో చేపట్టనున్న ‘ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర’ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని కలిసింది.

ఈ సందర్భంగా యాత్ర లక్ష్యాలు, ఎస్టీ సమాజ అభివృద్ధి కోసం చేపట్టనున్న కార్యక్రమాలను ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. గిరిజన వర్గాల సాధికారత, సంక్షేమానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ భేటీలో లోక్‌సభ సభ్యుడు బలరామ్ నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశంలో హాజరయ్యారు.

Spread the love

Related News

Latest News