నిజాంసాగర్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

కామారెడ్డి, ప్రతిపక్షం, జూన్ 12: కామారెడ్డి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

పోలీసుల వివరాల ప్రకారం, మృతులు సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన కృష్ణతో పాటు అతని ఇద్దరు కుమార్తెలు అనన్య, రక్షితగా గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వారు ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం ముగ్గురి మృతదేహాలను నీటిలో నుంచి వెలికితీశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Spread the love

Related News

Latest News