ప్రతిపక్షం, జూలై 24: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ యువతలో పెరుగుతున్న ఆందోళనలపై స్పందించారు. కష్టానికి తగిన గుర్తింపు లభించే వ్యవస్థ ఏర్పడాలని, నిజాయితీ, ప్రతిభకు ప్రాధాన్యం కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
తన తండ్రి ఎప్పుడూ “పరీక్షలో విఫలమైనా పరవాలేదు.. కానీ మోసం చేయొద్దు, అడ్డదారులు వెతకొద్దు” అని చెప్పేవారని సచిన్ గుర్తు చేసుకున్నారు. అదే విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
ప్రస్తుతం యువతలో కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదనే భావన, ఆందోళన ఉండటం సహజమేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు, యువత మరోసారి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

















