ప్రతిపక్షం, జూలై 21: ప్రముఖ రియాలిటీ షో తెలుగు బిగ్‌బాస్-10 సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోని బిగ్‌బాస్ ఎడిషన్లను ఒకేసారి ప్రారంభించనున్నట్లు జియోస్టార్ ప్రకటించింది.
తెలుగు బిగ్‌బాస్-10కు నాగార్జున, హిందీ వెర్షన్‌కు సల్మాన్‌ఖాన్, తమిళానికి విజయ్ సేతుపతి, కన్నడకు కిచ్చా సుదీప్, మలయాళానికి మోహన్‌లాల్ హోస్ట్‌లుగా వ్యవహరించనున్నారు. బెంగాలీ ఎడిషన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ హోస్ట్‌గా వ్యవహరించనుండటం విశేషం.


















