[t4b-ticker]

అణగారిన గొంతుకలకు ఆత్మగౌరవం.. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా కవిత

ప్రతిపక్షం, ఆగస్టు 08: తెలంగాణలో బహుజన, అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం, ఆత్మగౌరవం కల్పించడమే లక్ష్యంగా కల్వకుంట్ల కవిత ముందుకు సాగుతున్నారని ఆమె అనుచరులు పేర్కొన్నారు. సామాజిక న్యాయం కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో కనిపించాలనే ఉద్దేశంతో కవిత చేస్తున్న కార్యక్రమాలకు మంచిర్యాల జిల్లాకు చెందిన దళిత మహిళ అవునూరి శ్రీవాణి ఉదంతాన్ని ఉదాహరణగా చూపుతున్నారు.

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గుల్లకోట గ్రామానికి చెందిన అవునూరి శ్రీవాణి సాధారణ దళిత నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ. గత సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమెకు పలు అడ్డంకులు ఎదురయ్యాయని చెబుతున్నారు. ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా వివక్షను ఎదుర్కొన్నప్పటికీ రాజకీయంగా ముందుకు రావాలనే పట్టుదలతో ఆమె ప్రయత్నాలు కొనసాగించారు.

ఈ క్రమంలో కవిత ప్రతిపాదిస్తున్న సామాజిక తెలంగాణ సిద్ధాంతాలకు ఆకర్షితురాలైన శ్రీవాణి తెలంగాణ రక్షణ సేనలో చేరారు. అన్ని వర్గాలకు సమాన హక్కులు, గౌరవం దక్కాలనే లక్ష్యంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

కవిత చేపట్టిన తొలి దశ బాయి బాట పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన ‘ఊరూరా జెండా పండుగ’ సందర్భంగా శ్రీవాణి తన గ్రామంలో తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెను ఏర్పాటు చేసి కవితను ఆహ్వానించారు. గతంలో తాను వివక్షను ఎదుర్కొన్న అదే గ్రామంలో కవిత చేతుల మీదుగా పార్టీ జెండాను ఎగురవేయించడం ద్వారా శ్రీవాణి తన రాజకీయ ప్రస్థానంలో మరో అడుగు ముందుకు వేశారు.

తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’లోనూ శ్రీవాణికి మాట్లాడే అవకాశం కల్పించారు. వేలాది మంది పాల్గొన్న సభలో అణగారిన వర్గాలకు చెందిన మహిళకు వేదికపై అవకాశం కల్పించడం సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇస్తున్నామనే సందేశాన్ని ఇచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అణగారిన వర్గాలకు చెందిన మహిళలకు రాజకీయ వేదిక కల్పించడం, వారిని నాయకత్వం వైపు ప్రోత్సహించడం ద్వారా సామాజిక తెలంగాణ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది కవిత లక్ష్యంగా ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. శ్రీవాణి అనుభవం గ్రామస్థాయి నుంచి అణగారిన వర్గాల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నాలకు ఉదాహరణగా నిలుస్తోందని చెబుతున్నారు.

మాటలకే పరిమితం కాకుండా అణగారిన వర్గాలకు చెందిన మహిళలకు రాజకీయ అవకాశాలు, ఆత్మగౌరవం కల్పించడమే నిజమైన సామాజిక న్యాయమని కవిత నాయకత్వం నిరూపిస్తోందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

Spread the love

Related News

Latest News