Trending Now

కాంగ్రెస్ వస్తేనే బంగారు భవిష్యత్తు..

కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లూరి మల్లారెడ్డి..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 26 : కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మనందరికీ బంగారు భవిష్యత్తు లభిస్తుందని లేనట్లయితే ఆందోళనకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రముఖ న్యాయవాది సీనియర్ కాంగ్రెస్ నాయకులు అల్లూరి మల్లారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ మండలం మూటపూర్, లక్ష్మణచాంద మండలం వడ్యాల్ తండా గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కూలి పనుల వద్ధ పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆయన 60 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు వినూత్నమైన సంక్షేమ పథకాలు కార్యక్రమాలను అమలు చేయడమే కాకుండా దేశంలో అనేక సంస్థలను ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ దేనిని చెప్పారు.

కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణకు కాంగ్రెస్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ మోసపూరిత ప్రకటనలు మాటలను నమ్మి ఇప్పటికే 10 ఏళ్లపాటు మోసపోయామని మరో మోసపోయేందుకు ఎవరైనా సిద్ధమైతే ఆలోచించుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఈత బోధ చేశారు.ఈ కార్యక్రమములో నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు ఎంబరి గంగాధర్,రెగుంట గంగాధర్ ముటాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ దేవేందర్ యాదవ్,అమరగొండ రవీందర్ గౌడ్,గిరిగంటి అశోక్, బి. రాజు, నలూరు సాయన్న, గణేష్, పీ. వెంకటి, మణి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News